Eswar Tanikella
Eswar Tanikella Mar 25, 2020

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 9 शेयर
sunitha May 10, 2020

+6 प्रतिक्रिया 2 कॉमेंट्स • 11 शेयर
kanakalasrinu May 8, 2020

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Dvsraju May 10, 2020

🙏మాతృదినోత్సవం అమ్మకు వందనం 🙏 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 అమ్మ.. అంటే ఆనందం. కష్టం కలిగినా.. సంతోషం కలిగినా తొలి మాట అమ్మా.. అంటాం. తొమ్మిది నెలలపాటు కడుపులో ఉన్న బిడ్డ కోసం తపస్సు చేసి శిశువుకు జన్మనిచ్చే తల్లి కోసం ప్రపంచ వ్యాప్తంగా మే 10 (ఆదివారం) 2020 మాతృదినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అమ్మకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉగ్గుపాలు పోసినప్పటి నుంచి.. తన కాలిపై స్వతహాగా నిలబడేంత వరకు బిడ్డను కంటికి రెప్పలా చూసుకునే అమ్మ గొప్పదనాన్ని స్మరించుకుంటున్నారు. అలాంటి అమ్మకు మన తెలుగు సినిమారంగంలో విశిష్ట స్థానం ఉంది. జాతీయ స్థాయిలో కూడా అమ్మ పాటకు గుర్తింపు తెచ్చారు వేటూరి సుందరరామ్మూర్తి. మాతృదేవోభవ చిత్రంలో ‘వేణువై వచ్చాను భువనానికి...గాలినై పోతాను గగనానికి’ అంటూ ఎంతో హృద్యంగా సాగిన ఆ పాటకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఇలా ఎందరో గాయకులు, కవులు అమ్మ గొప్పదనాన్ని వెలుగెత్తి చాటారు. అయితే నేటి ప్రపంచంలో అమ్మను చూసుకోవడం భారంగా భావించేవారు లేకపోలేదు. మనల్ని కంటికి రెప్పలా చూసుకునే తల్లికి వయస్సు పైబడితే భారంగా భావించి... వృద్ధాప్య ఆశ్రమంలో వదిలిపెట్టేయడం సహజమైంది. ఆధునికత పెరుగుతున్న కొద్దీ మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. అలాంటి వారు మీరైతే అమ్మకు ప్రాధాన్యమివ్వండి.. అప్పుడే మీ పిల్లలు మీకు ప్రాధాన్యమిస్తారు. లేకుంటే అమ్మకు ఏర్పడిన గతే భవిష్యత్తులో మీకు ఏర్పడక తప్పదని మానసిక నిపుణులు మాతృదినోత్సవం సందర్భంగా కీలక సూచనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అమ్మ ప్రాధాన్యతను తెలిపే పోస్టర్లు, ట్వీట్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డేను అందరూ అట్టహాసంగా జరుపుకుంటున్నారు. తమకు జన్మనిచ్చిన తల్లికి విలువైన కానుకలిచ్చి.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమ్మ.. నిర్వచనానికి అందని పదం. వేలకోట్ల భావాలకు ప్రతిరూపం. జీవాన్ని, జీవితాన్ని ఇవ్వడమే కాదు..జీవితకాలపు ప్రేమైక మమకారాన్ని పంచడంలో తల్లిని మించి ఎవరూ వుండరు. అమ్మ అనే పలుకు తీయదనం అమ్మ అనే భావన ఇచ్చే భరోసా ప్రపంచంలో మరేశక్తీ ఇవ్వదు. ఇవ్వలేదు. కష్టాలకొలిమిలో కాలిపోతూ కూడా సుఖాల పొత్తిలిలో హత్తకుని రక్షించేది తల్లి మాత్రమే. జీవనసుడిగుండంలో చిక్కుకున్నా.. తన కొంగుచాటున బిడ్డల్ని నిలిపి వారి భవిష్యత్తు కోసం తపించేది మాతృమూర్తి మాత్రమే. బిడ్డ ఆకలి తీర్చడానికి తన రక్తాన్ని స్తన్యంగా అందించి.. ఆనందించే దైవ రూపం. అయితే, కంటేనే తల్లి అని అనుకోవడానికి లేని అనేక సంఘటనలు నిత్యం మనం చూస్తుంటాం. తనకు సంబంధంలేని వ్యక్తి ఆకలిని తీర్చడానికిీ తను తినకుండా కూడా అహారాన్ని ఇచ్చే తల్లులు ఎందరో. 'మాతృదేవోభవ' సూక్తికి నిజమైన తెర రూపం! కటిక పేదరికంలోనూ కూలి పనితో బిడ్ఢల కడుపునింపే అమ్మలెందరో.. తన ఆరోగ్యం కుంటుపడినా.. పిల్లల ఆరోగ్యం కోసం పరితపించే మాతృమూర్తులకు లెక్కేలేదు.. కొలవలేనిది..తరిగిపోనిది.. రుణం తీర్చుకోలేనిది అమ్మ ప్రేమ ఒక్కటే! అమ్మ కోసం జీవితాన్ని ఆమె పాదాల ముందు పరచినా సరిపోదు. కానీ, అమ్మకు ఒక కృతజ్ఞత.. తల్లి త్యాగానికి ఓ వందనం.. అన్నిటికీ మించి తరగని అమ్మ ప్రేమ గుర్తులు నిండిన హృదయంతో ఓ మాతృమూర్తి..నీకిదే నమస్సుమాంజలి అంటూ ప్రపంచం అంజలి ఘటించే మదర్స్ డే సందర్భంగా అమ్మకు వందనం.

+8 प्रतिक्रिया 0 कॉमेंट्स • 32 शेयर
sharat kuchi May 10, 2020

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Eswar Tanikella May 9, 2020

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Eswar Tanikella May 8, 2020

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Eswar Tanikella May 8, 2020

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB