పుణ్యక్షేత్రాలు

Gayatri Sep 17, 2019

రెండు రోజుల కిందట నేను దర్శించుకున్న పుణ్యక్షేత్రం సూళ్లూరు పేట చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారు .నేను విన్న కధ మీకు చెప్పాలి అనే సంకల్పం తో ఈ పోస్ట్ . నేను రెండు సార్లు నిద్ర చేసి వచ్చాను .అనుకున్న పనులు అవ్వడం వలన ....ఫోటోలు తీయడం వద్దు అని అక్కడి సిబ్బంది అనడం వలన పాత pics వెదకి పెట్టాను . అమ్మవారి దర్శన ఫలితము వలన కలిగే సత్ఫలితాలు .. పిల్లలు లేనివారికి సంతాన యోగం కలుగుతుంది ..వివాహం కానివారికి వివాహం .భార్యాభర్తల మనస్పర్థలు లేకుండ పోతాయి .అప్పుల బాధతో కూరుక పోయిన ఆ ఇబ్బందులు తొలగుతాయి .ఎలాంటి ఈతి బాధలు ఐన ఆ తల్లి చల్లని చూపుతో తొలగిపోతాయి... నెల్లూరు నుండి ఏ ఊరు పేరు ఐన ఎక్కువగ ళ తో ఉంటుంది నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేటను పూర్వము 500 సం కిందట శుభగిరి అని పిలిచేవారు ట ..అక్కడ కాళింది అనే నది ఉంది ట ... చాల పేదలు ఉండే పల్లెటూరు ..రెడ్లు ఎక్కువగ ఉండేవారు ట ...కాళింది నది దగ్గర కు రోజు వెళ్లి పిల్ల కాపరులు బర్రెలను కాచేవారు ట ..ఒక రోజు ఆ పిల్ల కాపరులు నీటిలోకి దిగారు నీళ్లు తాగడానికి ఐతే ఆ నీటిలో సుడులు తిరుగుతున్న సుడిగుండాలు ఉండేవి ట ..ఆ నీటిలో సుడిగుండాలు ఉన్నాయి అని పిల్లకాపరులకి తెలియదు ట ..అందులో ఒక పిల్లవాడు ఆ సుడిలో పడి భయపడుతూ ఏడుస్తుంటే అక్కడ ఏదో పట్టుకొని ఉన్నట్టు అనిపించింది ట . చిన్నగ సుడులు ఆగగానే ఆ పిల్లవాడు భయం నుండి తేరుకొని పిల్లలలో లోపల ఏదో ఉంది అది నన్ను పట్టుకొని బయటకి పంపింది అని చెప్పగానే తోటివాళ్ల అందరు కలిసి ఏమిటో అని తీసి చూడగా ఒక రాయి మీద అమ్మవారి రూపం కనిపించింది ట కాళి రూపము లో రెండు పక్కల ఉన్న 5 చేతులు ఉన్నాయి ట చేతులలో ఏవో ఆయుధాలు .ఒక చేతిలో త్రిశూలం కాలి కింద రాక్షసుడు ని తల ఉండడం చూసి భయపడిన చీకటి అవ్వడం తో అలానే ఒడ్డున కింద ఉంచి వెళ్లిపోయారు ట ఐతే ఆ రాత్రే కలలో ఒక రెడ్డి గారికి నేను ఉన్న చోటనే గుడి కట్టించమని చెప్పినట్టు అనిపించింది ట మరురోజు ఉదయం అందరు వెళ్లి చూడగ అమ్మవారు దక్షిణ దిక్కు చూస్తు నిలిచారు ట .. .ఐతే అమ్మవారి కాలి కింద రాక్షసుడు ని తొక్కిపట్టి నట్టు ఉండిన అమ్మవారి మోము ప్రసన్న వదనం తో ఉన్నారు ట అమ్మవారికి చిన్న గుడి ల కట్టి మొదలు పెట్టాక ఊరు అంత సుభిక్షంగ ఉండడం ఆర్ధిక స్థితి మెరుగు అవ్వడం తో అందరు కలిపి గుడిని పెద్దది చేసి అమ్మవారి కి నగలు చేయించారు ట...అమ్మవారికి నగలు అలకరించారు ..ఒక దొంగ అమ్మవారి నగలు కాజేయడానికి వెళ్ళగ అమ్మవారు కళ్ళు తెరిచి చూడగ అతను బయము తో సొమ్మసిల్లి పోయాడు ట మరుసటి రోజు ఉదయం అమ్మవారి పూజకు వచ్చిన వారు చూడగ ఎవరో పడి ఉన్నారు అని గమనించి లేపి అడగగ దొంగ చెప్పిన మాట విని అయ్యో యిలా అమ్మ కి తలుపులు పెట్టించాలి అని రెండు తలుపులు చేయించి అక్కడే ఉన్న చెట్టు కి అనించారు చీకటి పడింది రేపు ఉదయం వచ్చి పెట్టాలి అనే ఆలోచనతో .మరుసటి రోజు ఉదయం రాగానే ఆ రెండు తలుపులు చెట్టుకి అతుక్కుని చిగురు పెట్టింది ట . ఇప్పడు ఆ చెట్టు వద్ద నమస్కారం చేసి ఒక పసుపు గుడ్డ ముక్కలో ఒక రాయి ని పెట్టి 3చుట్లు తిరిగి ఆ రాయిని ఆ చెట్టు కి కడతారు.ఎంతటి కోరిక ఐన తీరుస్తుంది అమ్మ అనే ఆశ.అమ్మవారికి నిమ్మకాయల దండను వేస్తారు .. అక్కడ ఉన్న ఒక అతనికి అమ్మవారు పూని నాకు తలుపులు వద్దు .నేను ఎప్పుడు భక్తులను చూడాలి అని చెప్పిందిట ..అలా అమ్మవారికి 24 గంటలు ఎవరు ఐన దర్శనము చేసుకోవచ్చు ..అమ్మవారికి తలుపులు వేయరు..అమ్మవారు ని చూడగానే ప్రశాంతమైన వదనం చిరునవ్వుతో దర్శనం ఇస్తారు ...రాత్రిళ్ళు నిదుర చేయడానికి వసతి ఉంది ..మొక్కులు తీరితే ఆదివారం.శుక్రవారం జంతుబలి ఇస్తారు ...అక్కడ పెళ్లి చేసుకొనే సదుపాయంలు ఉన్నాయి..తమిళులు ఎక్కువ వచ్చి పెళ్లిళ్లు చేసుకుంటారు .ఉచిత భోజన సదుపాయం ఉంది ..Non ac 200రు Ac 800 రూమ్స్ ఉంటాయి అమ్మ సన్నిధిలో ..డబ్బులు పెట్టకుండ కూడ అమ్మవారి సన్నిధి లో నిద్ర చేస్తారు ...ఏది మొక్కుకున్న చిత్తశుద్ది తో ఆ చెంగళమ్మ తల్లి కోరికలు నెరవేరుస్తుంది ...ఆ తల్లి పిలుపు రాకుండా ఎంత ప్రయత్నం చేసిన వెళ్లలేము ...తాయత్తు లు ఉంటాయి 30 rs ..అవి కట్టుకుంటే అమ్మ రక్ష ఉన్నట్టు ఉంటుంది ..అమ్మ సన్నిధిలోనే ఉంటాయి ...అమ్మవారికి పసుపు కుంకాలు చీరపెట్టి అమ్మను శరణు వేడుకోవచ్చు ...అక్కడ అమ్మవారి మీద వేసిన చీరలు అమ్ముతారు .ఎంతో మహిమాన్వితమైన ఆ చెంగాళమ్మ పరమేశ్వరి దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం గ భావిస్తారు.. ఆ చెంగాళమ్మ పరమేశ్వరి తల్లి ఎంతో మహిమ గల శక్తి .ఆ అమ్మ కృప ప్రతి ఒక్కరి యందు ఉండాలి అని ఈ పోస్ట్ పెట్టాను ...

+35 प्रतिक्रिया 2 कॉमेंट्स • 11 शेयर
sailaja sailu Oct 1, 2019

+24 प्रतिक्रिया 2 कॉमेंट्स • 19 शेयर
నాని Sep 23, 2019

+14 प्रतिक्रिया 3 कॉमेंट्स • 11 शेयर
sharat kuchi Oct 4, 2019

+12 प्रतिक्रिया 0 कॉमेंट्स • 6 शेयर

🙏పౌర్ణమికి కోటప్పకొండ గిరి ప్రదక్షిణ ఆహ్వానం🙏 ----------------------- శ్రీ వికారి నామ సంవత్సర ది.13-10-2019 తేది ఆదివారము ఉదయం 6-00 గంటలకు (ఖచ్చితంగా ఉదయం 6-00 గంట లకు ) "ఆశ్వీజ పౌర్ణమి " సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరునికి- 16వ 🙏"గిరి ప్రదక్షణము"🙏 ఘాట్ రోడ్ వినాయకుని గుడి వద్ద నుండి ప్రారంభం అగునని తెలియచేయుచున్నాము .ఆదివారం రవి వారం పౌర్ణమి తిథి పూర్ణ చంద్రుడు ఉత్తరభద్రా నక్షత్రం శని నక్షత్రం భక్తులందరూ ఈ పౌర్ణమి గిరి ప్రదక్షణములో పాల్గొనవలసినదిగా కోరుచున్నాము. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చేయవలసిన నామం :- దక్షిణాన దక్షిణాన దక్షిణాన పాహిమాం దక్షిణాన దక్షిణాన దక్షిణాన రక్షమాం త్రికుటేశ్వర త్రికుటేశ్వర త్రికుటేశ్వర పాహిమాం త్రికుటేశ్వర త్రికుటేశ్వర త్రికుటేశ్వర రక్షమామ్.

+22 प्रतिक्रिया 1 कॉमेंट्स • 6 शेयर
sharat kuchi Sep 28, 2019

+11 प्रतिक्रिया 1 कॉमेंट्स • 2 शेयर
Dvsraju Oct 4, 2019

పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే 108 శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.మహాలక్ష్మిని ప్రేమగా అంబా బాయి అనికూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను కోరుకుంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా, కొల్హాపూర్, భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది.7 వ శతాబ్దం లోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశ రాజైన కరన్దేవ్ తిరిగి చాలాకాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండ్ పతి ప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8 వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది.నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్ కి తండోపతండాలుగా వస్తారు. ఈ సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతమైన రంగులతో, సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది. ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ, 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మీ కొలువై ఉంటుంది. 3 అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మీ ప్రతిమను చెక్కడం జరిగింది. ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడి ఉంది. దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది. కిరీటంపై విష్ణువు తల్పం అయిన శేషనాగు యొక్క చిత్రం ఉంటుంది. ఆమె నాలుగు చేతులలో గుర్తింపు కలిగిన నాలుగు వస్తువులు ఉంటాయి. కుడివైపు క్రింది చేతిలో మాలుంగ (సిట్రస్ జాతి ఫలం), ఎడమవైపు కింది చేతిలో పాత్ర ఉంటుంది. హిందూ పవిత్ర చిత్రాలలో ముఖం ఉత్తరవైపు లేదా తూర్పు వైపు చూసే విధంగా ఉంటుంది. ఈ దేవతా విగ్రహం పశ్చిమవైపు చూసే విధంగా ఉంటుంది. చిన్న తెరిచిఉన్న కిటికీ పశ్చిమవైపు గోడకు ఉంటుంది. సూర్యాస్తమయం అయినపుడు సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం 21 మార్చి మరియు 21 సెప్టెంబరు లలో మూడురోజులపాటు విగ్రహంపై పడతాయి. ఆలయ పరిసరాల్లో నవగ్రహాల, సూర్యుని, మహిసాసుర మర్థని, విఠల్-రఖ్‌మయి, శివుడు, విష్ణువు, తుల్జా భవాని మరియు యితర విగ్రహాలు ఉంటాయి. వీటిలోకొన్ని విగ్రహాలు 11వ శతాబ్దానికి ముందువి కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి. ఆలయం వద్ద మణికర్ణికా కుండం అనే కొలను ఉంది. ఆ కొలను ఒడ్దున విశ్వేశ్వర మహాదేవ్ విగ్రహం ఉంది. అమ్మవారికి రోజూ అయిదు సార్లు అర్చన జరుగుతుంది .ఉదయం అయిదు గంటలకు శ్రీ మహా లక్ష్మీ దేవికి సుప్రభాత సేవ చేస్తారు. కాకడ హారతి ఇస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రాలలో పూజ, శేజ్ హారతి జరుపుతారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో, పౌర్ణమి నాడు, అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు. మహాలక్ష్మి దేవాలయం 'హేమాడ్ పంతి' నిర్మాణశైలిలో కట్టబడింది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం వుంది. గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని 'అంబాబాయి' అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఐదు కి.మీ. దూరంలో ఉన్నతెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది. పూర్వకథ:- అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి, శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే, అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట. శివుని ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది. అమ్మవారు వెలసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురమనే పేరు సార్థకమైంది. ఈ నగరాన్ని కోల్‌పూర్ అని కోల్‌గిరి అని, కొలదిగిరి పట్టణ్ అని పిలిచేవారు. ‘కొల్లా’ అంటే ‘లోయ’అని, ‘పూర్’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లిందని చెబుతారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వికులు పాలించగా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్థమానమైందని తెలుస్తోంది. ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా, నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రంలో మహాలక్ష్మిఅధిష్టాన దేవత కాగా, శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా, మూడున్నర కోట్ల తీర్థాలూ సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని, అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచ మహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయంటారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని కరవీర నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని స్తుతించారని పద్మ, స్కాంద, దేవీభాగవతాలు ప్రస్తావించాయి. లక్ష్మి లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. త్రిమూర్తిలలో ఒకరైన విష్ణువు నకు ఇల్లాలు.భృగు పుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపవశమున క్షీర సాగరమథన సమయంలో ఉద్భవించింది. జైనమతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టనష్టాలనుండి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుంది. సంస్కృతంలో "లక్ష్మి" అన్న పదానికి మూల ధాతువులు - లక్ష్ - పరిశీలించుట, గురి చూచుట . ఇదే ధాతువును "లక్ష్యం" అనే పదంలో కూడా చూస్తాము. వేదాలలో లక్ష్యాయిధి లక్ష్మిః - అనగా జనులను ఉద్ధరించే లక్ష్యం కలిగినది - అని అన్నారు. మహాలక్ష్మిని శ్రీ అని కూడా అంటారు. తమిళంలో తిరుమగళ్ అంటారు. ఆమె ఆరుసుగుణములు పరిపూర్ణముగా కలిగినది. నారాయణుని శక్తికి ఆమెయే కారణము. ఆమె విష్ణువునకు ఇల్లాలు. సీతగా రాముని పెండ్లాడినది. రాధ, రుక్మిణి మరియు శ్రీకృష్ణుని భార్యలందరును లక్ష్మీదేవి అంశలే బెంగాల్‌లో దుర్గాపూజ సమయంలో లక్ష్మి, సరస్వతి, వినాయకుడు, కార్తికేయుడు - వీరందరినీ దుర్గామాత బిడ్డలుగా ఆరాధిస్తారు. హిందూమతంలో వైదికకాలంనుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నదనడానికి ఆధారాలున్నాయి. ఋగ్వేద కాలంలో అదితి, రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా, సంప్త్పదాయినులుగా ఆరాధించారు. అధర్వణ వేదం "సినీవాలి" అనే దేవతను "విష్ణుపత్ని"గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు. ఋగ్వేదంలో అక్కడక్కడ లక్ష్మి, శ్రీ అనే పదాలు కనిపిస్తాయి.కాని ఋగ్వేదంలో ఎక్కడా సంపదకు సంబందించిన విశేషమైన దేవతగాని, దేవికాని కనిపించదు.సంపదలకు ఇంద్రుడు, అశ్వినీ కుమారులు, మొదలగు దేవతలను యాచించేవారు.ఋగ్వేదంలో అక్కడక్కడా స్తీ దేవతలు కనిపిస్తారు. యజుర్వేదకాలం నాటికి శ్రీ మరియు లక్ష్మి పరమ పురుషుని పత్నులుగా వెలుగులోకి వచ్చారు.అధర్వణవేదం కాలం మొదట్లో శ్రీ పదాన్ని సంపతి, ఐశ్వర్యం అనే అర్ధాన్ని స్ఫురిస్తాయి.ఈ కాలంలో శ్రీ కి లక్షికి అంతగా బేధం ఉన్నట్లు కనిపించదు.కాని లక్ష్మిని పొందడానికి బలి ఇవ్వడం అన్నది ఈకాలంలోనే మొదలైంది.మొహంజెదారోలో లభించిన ఒక నాణెంపై దేవి సమక్షంలో ఒక మేకపోతు ఉన్నట్లు కనిపిస్తుంది. అధర్వణ వేదకాలానికి యిద్దరు లక్ష్ములు వెలిసారు.ఒక లక్ష్మి మంచిది.మరొకటి పాపి. ఒకటి ఆర్యుల శ్రీదేవి.పాపిలక్ష్మి అనార్యుల దేవి.అవే లక్ష్మి, అలక్ష్మి. పురాణకాలం నాటికి లక్ష్మి, విగ్రహారాధన పూర్తిగా ప్రచారం లోనికి వచ్చింది కాని, యజ్ఞయాగాదుల పట్లప్రజల విశ్వాసం తగ్గుతూ వచ్చింది.పురాణకాలం నాటికి లక్ష్మికి చక్కటి రూపకల్పన జరిగి పోయింది.పూజా విధానం కూడా వెలుగులోకి వచ్చింది.బ్రహ్మ పురాణంలో వర్ణించబడిన లక్ష్మి మరియు దరిద్ర దేవతల మధ్య జరిగిన కధనం చాల చక్కగా ఉంటుంది.దాని సంగ్రహమే లక్ష్మీ దేవే రుక్మిణి, సీతగా వివిధ కాలాలలో అవతరించిందిగా వర్ణించబడినది. లింగ పురాణంలో కూడా లక్ష్మీ దేవి సముద్రం నుంచే ఉద్భవిస్తుంది. పురణకాలం నాటికి లక్ష్మికి, యక్షిణిలతో సంబంధం పూర్తిగా విడిపోయింది.గుడ్లగూబ లక్ష్మీవాహనంగా గుర్తించబడింది.విష్ణుపత్ని అయిన కారణంగా గరుడపక్షి కూడా లక్ష్మికి వాహనమే. గుడ్లగూబ లక్ష్మికి వాహనంగా ఎలా మారిందో ఒక కధ వర్ణించబడినది.పూర్వకాలంలో ఒక వృద్ధదంపతులు ఉండేవారు.వారికి కటికదరిద్రులు.ఉన్నది ఒక్కటే గుడ్డ.ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు ఆగుడ్డతో బయటకు వెళ్ళాలి.ఒకనాడు అలా యాచనకు వెళ్ళిన ఆబ్రాహ్మణుడు ఏమీ దొరకని కారణంతో చావాలని అనుకుంటాడు.అలా తన బాధలను తలచుకొని ఒక చెట్టు క్రింద కూర్చొని విలపిస్తాడు. అదంతా ఆచెట్టుపైనున్న గుడ్లగూబ వింటుంది.ఆవేద బ్రాహ్మణుడి ఓదార్చి తన కష్టాలను తీరుస్తానని చెప్పి ఇంటికి వెళ్ళమంటుంది. దీపావళి రోజున, ప్రతియేడు లాగానే లక్ష్మి నగరంలో ప్రవేశిస్తుంది.ఏ గడపలో కాలు పెట్టిన గుడ్లగూబ కూతవిని అపశకునంగా వెనక్కు వెళ్తుంది.చివరకు ఈ బ్రాహ్మణుడి ఇంట్లో కాలు మొపబోతుంది.గుడ్లగూబ కూయదు.దాంతో లక్ష్మీ దేవి ఆబ్రాహ్మణుడి ఇంట్లో ప్రవేశిస్తుంది. తాను వెళ్ళదలచుకొన్న ఇంట్లోకి వెళ్ళనీయకుండా అవరోధం కలిగించిన గుడ్లగూబను తన వాహనంగా చేసుకుంటుంది. భారతీయ నాగరికత విదేశాలలో ప్రవేశించాక విదేశాలలో కూడా ఏదో ఒక రూపంలో లక్ష్మి కొలవబడుతుంది. బాలి ద్వీపంలో హిందేషియా రాజులు లక్ష్మి రాణిరూపంలో ఉండేటట్లు భావించేవారు.జావాలో పురాతనమైన బంగారు ఆభరణాలపై శ్రీ అని వారిభాషలో వ్రాయబడినది.కాంబోడియాలో విష్ణువుతో పాటు పలు లక్ష్మీ దేవి విగ్రహాలు చెక్కబడ్డాయి. మనకు ద్రవ్యానికి లక్ష్మి దేవత అయినట్లు, జూనో-మోనెటా స్త్రీ దేవత, రోమన్ లకు ద్రవ్యదేవత.అందుకు సాక్ష్యం అక్కడ దొరికిన నాణాలపై ఒక వైపు ద్రవ్యదేవత రెండవవైపు ద్రవ్యవిలువ ముద్రించేవారు.ఈనాడు మనం ఆగ్లపదంగా ఉచ్చరించే మనీ మోనెటా నుండే వచ్చింది. లక్ష్మీ దేవి గురించి వివిధ గాథలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె 'నిత్యానపాయిని' (ఎన్నడూ విడివడనిది), లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువునుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్ళి చేశాడు. కనుక లక్ష్మిని 'భార్గవి' అని కూడా అంటారు. తరువాత ఒకమారు దూర్వాసుని శాపకారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగాచేసె చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మిదేవి అవతరించింది. పాలసముద్రలో నుండి జనించింది కనుక ఆమె 'సముద్రరాజ తనయ' అయ్యింది. ఆమెతో బాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాధి దేవత ఐయిన ఈ దేవిని శ్రీమహావిష్ణువు పత్నిగా స్వీకరిచాడు. విష్ణువు శక్తికి, మాయకు కారణం ఆయనకు లక్ష్మి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశ అని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణువు అవతారాలతోబాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని చెప్పబడింది. రామావతారంలో సీత గా, కృష్ణావతారంలో రుక్మిణి గా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడు అలమేలు మంగగా లక్ష్మి విష్ణువుకు తోడై ఉంది. చాలా మంది దేవతలకు వలెనే లక్ష్మికి ఎన్నో పేర్లు, అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి. అధికంగా లక్ష్మిని సంబోధించే నామాలలో కొన్ని - లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి (అన్నమయ్య సంబోధన), నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర. అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భూషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ. వాఙ్మయాధారాలలో ఋగ్వేదం పదవ మండలంలోని శ్రీసూక్తం సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన మాత (ప్రజానాం భవసి మాత.) యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ, లక్ష్మీ అనే ఇరువురు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహిత లలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను శిల్పీకరించే విధానాన్ని మత్స్య పురాణంలో ఇలా చెప్పారు - "దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమలు కలిగి సర్వాభరణములు ధరించి ఉండవలెను. ముఖం గుండ్రంగా ఉండాలి. దివ్యాంబరమాలా కంకణధారియై యండాలి. ఎడమచేతిలో పద్మం, కుడిచేతిలో బిల్వఫలాలు ఉంచాలి. పద్మాసీనయైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగాడుచున్నట్లుగాను, ఇరువైపుల తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి. అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ-చక్ర-గదా-పద్మ-ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణుసహితయైనప్పుడు ద్విభుజయై పద్మమునుదాల్చి సర్వాభరణభూషితయై యుండును. స్వతంత్రమూర్తిగా మలచినపుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసీనయై, పద్మము, అమృత పాత్ర, బిల్వ ఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలయును. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను సూచించును. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. వరాహమిహిరుని బృహత్సంహితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి కాని లక్ష్మీదేవి ఆకృతిగురించి చెప్పలేదు. కారణం తెలియడంలేదు. లక్ష్మీ దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. 🕉🌞🌎🌙🌟🚩

+10 प्रतिक्रिया 0 कॉमेंट्स • 5 शेयर